చండూరు, ఆగస్టు 22 : చండూరు మండలంలోని పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వివిధ పంటలను పుల్లెంల ఏఈఓ పవన్ శుక్రవారం పరిశీలించారు. ప్రత్తి పంటకు డ్రోన్ తో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడాన్ని పరిశీలించి, రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అదే విధంగా పత్తి పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులు, నానో యూరియా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నీలకంఠం జాని, పాలకూరి రాములు, బద్దుల గోపాల్, యాస వరలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.