శాలిగౌరారం, అక్టోబర్ 15 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు, తుడిమిడి గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు మధ్య దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తాలూరి మురళి, తాసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఏటీఎం శంకర్, ఏఎంసి వైస్ చైర్మన్ నరసింహ, నాయకులు కందాల సమరంరెడ్డి, అన్నేబోయిన సుధాకర్, ఎర్ర చైతన్య, రాజు పాల్గొన్నారు.