మునుగోడు, ఏప్రిల్ 14 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను రైతులు సద్వినియోగ పరచుకోవాలని, తద్వారా మిల్లులకు నాణ్యతతో కూడిన ధాన్యం చేరుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. మంగళవారం ఆయన మునుగోడులో మల్లికార్జున రైస్ మిల్లులో ధాన్యం సేకరణ కేంద్రాల భాద్యులతో మాట్లాడారు. వడ్ల సేకరణ ఓ యజ్ఞం వంటిదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధాన్యంలో తేమ, తాలు శాతం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.