పెన్పహాడ్, అక్టోబర్ 17 : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని పెన్పహాడ్ తాసీల్దార్ ధరావత్ లాలూనాయక్ అన్నారు. ధాన్యం 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నారు. శనివారం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్పహాడ్, చిదేళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారాంరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 72 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ అనిల్ నాయక్. సీ.ఓ సోమల్ల నాయక్. తూముల ఇంద్ర సేనరావు, జూలకంటి వెంకట్ రెడ్డి, ధర్మయ్య పాల్గొన్నారు.