కోదాడ, మే 06 : రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి అధిక దిగుబడిని సాధించాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుపతమ్మ అన్నారు. బుధవారం రైతు వారోత్సవాలను పురస్కరించుకుని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పంటల వైవిధ్యం పెంపు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైస్ చైర్మన్ బషీర్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కమిటీ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.