కట్టంగూర్, సెప్టెంబర్ 01 : యూరియా కోసం అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యూరియా కొరత కారణంగా రైతులు పనులు మానుకుని రాత్రిపగలు సింగిల్ విండో కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్ కు సోమవారం 222 బస్తాల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు అర్థరాత్రి నుంచే పీఏసీఎస్ వద్దకు చేరుకుని క్యూలో ఉన్నారు. ఏఓ గిరిప్రసాద్, సీఈఓ బండ మల్లారెడ్డి పర్యవేక్షణలో పోలీస్ పహారాలో సింగిల్ విండో సిబ్బంది పాస్ బుక్ కు ఒక్కో బస్తా యూరియా చొప్పున పంపిణీ చేశారు.