నల్లగొండ : రైతన్నను కడుపున పెట్టుకుని కాపాడుకునే రైతుబాంధవుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాసంగిలో పండిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోనుగులు చేస్తుందన్న ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో స్థానిక రైతులతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోవద్దన్ననే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు, కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పటికి రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు చేయటానికి సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ మేరకు రైతన్నకు అండగా నిలిచిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేసారు.