కోదాడ, ఆగస్టు 26 : మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా కోసం రైతుల అవస్థలు అంతా ఇంతా కాదు. బస్తా యూరియా కోసం రైతులు నాన్న తిప్పలు పడాల్సిన దుస్థితి దాపురించింది. మంగళవారం సొసైటీ వద్ద తోపులాట జరగకుండా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. రోజంతా నిలబడ్డా యూరియా దొరకకపోవడంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుని రాజును చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులు ఇలా పడిగాపులు పడే పరిస్థితికి తీసుకువచ్చిందని అసహనం వ్యక్తం చేశారు.