యూరియా కోసం పురుగుమందు డబ్బాలతో రైతుల నిరసన
రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రైతులు ఎవరూ క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ ను అందుబాటులో తెచ్చింది. యాప్ లో సైతం రైతులకు యూరియా బుక్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారు.
అనంతగిరి, ఫిబ్రవరి 13 : రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రైతులు ఎవరూ క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ ను అందుబాటులో తెచ్చింది. యాప్ లో సైతం రైతులకు యూరియా బుక్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారు. సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని గంటలకొద్ది నిరీక్షించినా ఒక్క యూరియా కట్ట కూడా బుక్ కాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమై పోతుండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు యూరియా ఆన్లైన్లో బుక్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం నిరసనకు దిగారు. కోదాడ- అనంతగిరి రోడ్డుపై పురుగుమందు డబ్బాలతో బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం ఖానాపురం ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో వ్యవసాయ అధికారులను నిలదీశారు. సంఘ పరిధిలోకి 444 యూరియా కట్టలు ఆన్లైన్లో వచ్చినప్పటికీ తమకు ఒక కట్ట కూడా బుక్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కట్టలు ఆన్లైన్లో పెడతామన్న సమయానికి కాకుండా ఆలస్యంగా ఆన్లైన్లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి సీజన్లో యూరియా విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సంఘ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.

యూరియా కోసం పురుగుమందు డబ్బాలతో రైతుల నిరసన
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

