యాదగిరిగుట్ట, మే 12: ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని రైతులు మల్లాపురంలో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని మల్లాపురంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేవన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.