మఠంపల్లి, అక్టోబర్ 8: యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. రోజుల తరబడి తిరుగుతున్నా బస్తా యూరియా అందక అవస్థలు పడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే మఠంపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు, మహిళలు క్యూలో వేచి ఉన్నారు. ఉదయం 9 గంటలకు కార్యాలయం తెరవగానే తోపులాట జరిగింది. రైతు లు కొంత సమయం లైన్లో ఉన్న తర్వాత మళ్లీ తొక్కిసలాట జరిగింది.
దీంతో కార్యాలయం షట్టర్ కిందకు దించడంతో అక్కడే ఉన్న ఓ రైతు దాని కింద పడటంతో గాయాలయ్యా యి. తోటి రైతులు ఆయనను పక్కకు లాగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ రోజూ యూరియా వస్తు న్నా.. తమకు మాత్రం అందడం లేదని, పైరవికారులకే అందుతున్నాయం టూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లకు యూరియా అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికే యూరి యా దొరకడంతో మిగిలిన రైతులు ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
లోడు వస్తున్నా యూరియా దొరకట్లే..
పాలకవీడు, అక్టోబర్ 8 : పాలకవీడు పరపతి సంఘం పరిధిలో యూరి యా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు గ్రామాల రైతులు పరపతి సంఘం కార్యాలయానికి లోడ్ వచ్చిన ప్రతీసారి వస్తూ వెనుదిరుగుతున్నారు. బుధవారం 444 బస్తాల యూరియా వచ్చిందని తెలుసుకొన్న రైతులు ఉద యం నుంచే క్యూకట్టారు. మండలం లో 22 గ్రామ పంచాయతీలు ఉం డగా మండల కేంద్రంలో మాత్రమే పరపతి సంఘం ఉంది. దీంతో ప్రైవే ట్ వ్యాపారులు బస్తా యూరియాను 400 నుంచి, 500 వరకు విక్రయిస్తున్నారు. పరపతి సంఘంలో ఎంఆ ర్పీకే అమ్ముతుండటంతో రైతులు బారులుదీరారు. క్యూలో ఉన్న ఒక్కొక్కరికీ రెండు బస్తాల చొప్పు న పంపి ణీ చేసినట్లు సీఈవో తెలిపారు.