చందంపేట, జూలై 2: పక్కదారి పట్టొద్దని..ప్రభు త్వం యాప్ ద్వారా యూరియా అందిస్తున్నప్పటికీ ఫర్టిలైజర్ దుకాణదారులు కొత్త తరహా యూ రియా దందాకు తెరలేపారు. యూరియా లోడు వస్తున్నదనే సమాచారాన్ని ముందుగా తమకు తెలిసిన రైతులకు చేరవేసి వారిపేరుతో యాప్ ద్వారా యూరియా బుక్ చేస్తారు.. అనంతరం యూరి యా కావాల్సిన రైతులకు ఎక్కువ ధరకు బ్లాకులో విక్రయిం చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే యాప్ ద్వారా యూరియా సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్న రైతులు..ఫర్టిలైజర్ దుకాణదారులు చేస్తున్న కొత్త తరహా దందాతో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేవరకొండ నియోజకవర్గంలోని పలువురు ఫర్టిలైజర్ దుకాణదారులు యూరియా దందాకు పాల్పడుతుండడంతో రైతులకు సరిపడ యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా లోడు వస్తున్నదనే సమాచారం ఉన్న ఫర్టిలైజర్ దుకాణదారులు తమకు తెలిసిన రైతులకు సమాచారం ఇచ్చి వారి పేరుతో ముందస్తుగానే బుక్ చేయిస్తున్నారు. లోడు రాగానే బస్తాకు రూ.350 నుంచి 500 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫర్టిలైజర్ నిర్వాహకుల తీరుతో వానకాలం ప్రారంభంలోనే యూరియా కొరత ఏర్ప డే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పేరుతో బుక్ చేసిన యూరియాను వారికే ఇవ్వాలి. అలా కాకుండా ఒకరి పేరుతో బుక్ చేసి మరొకరి యూరియాను ఎక్కువ ధరకు విక్రయించినట్లు ఫిర్యాదు అందితే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
-లక్పతి, ఏవో, చందంపేట