కోదాడ, ఆగస్టు 29 : కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన అన్నదాతలు యూరియా దొరకక సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తూ అరిగోస పడుతున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో సగానికి పైగా వరినాట్లు పడ్డాయి. దీంతోపాటు ఇతర పంటలు ఏపుగా పెరిగేందుకు యూరియా చల్లాల్సి ఉంది.. సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో వేసిన పంట లు నాశనమైతే అప్పుల పాలు కావాల్సి వస్తుంది. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల ప్రజల మా పిల్లలు.. వారి బాగోగులు చూసుకోవడమే మా లక్ష్యం.. మా జీవితాలు వారికే అంకి తం..అని మంత్రి ఉత్తమ్ అన్నారు.
కోదాడ నుంచి రెండు విడతలు హుజూర్నగర్ నుంచి మూడు విడతలు వెరసి ఐదుసార్లు మెజార్టీతో గెలిపించాం.. పద్మావతమ్మనూ కోదాడ నుంచి రెండుసార్లు గెలిపించాం. ఇక్కడి నుంచి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియోజకవర్గాలకు చెందిన రైతులందరూ పిల్లలతోసహా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ఎదుట యూరియా కోసం పడికాపులు కాస్తున్నాం. ఎకరానికి ఒక బస్తా అంతకన్నా ఎక్కువ ఉంటే రెండు బస్తాలు మాత్రమే యూరియా సరఫరా చేయటం వల్ల ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొన్నది. కొన్ని సొసైటీల ఎదుట నిలబడే ఓపిక లేక చెప్పులు క్యూలైన్లో ఉంచాల్సి వస్తుంది.. ఈ దుస్థితి ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాదు. జిల్లా వ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి ఇలానే ఉంది. పరిపాలన దక్షత ఉన్న జిల్లా మంత్రిగా ఔదార్యంతో పెద్ద మనస్సు చేసుకొని అవసరానికి సరపడా యూరియాను అందుబాటులో ఉంచి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాం..
రాజాపేట, ఆగస్టు 29 : యూరియా కొరతతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. వ్యవసాయ పనులు మానుకొని సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజాపేట మండలం కేంద్రంలోని పీఏసీఎస్‌కు 222 బస్తాల యూ రియా వచ్చిందని తెలుసుకున్న వందలాది మంది రైతులు ఉదయాన్నే అక్కడి చేరుకొని పాసు పుస్తాకాలను వరుస క్రమంలో పెట్టారు. పీఏసీఎస్ తెరవగానే యూరియా కోసం ఎగబడ్డారు. సం గం మందికి బస్తా యూరియా లభించడంతో మిగతావారు నిరాశతో వెనుదిరిగిపోయారు.
పెద్దవూర, ఆగస్టు 29: యూరియా కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. శుక్రవారం మండల కేంద్రంలోని సాగర్- హైదరాబాద్ హైవేపై రైతులు యూరియా కోసం ధర్నా చేపట్టారు. రెండు నెలల నుంచి యూరియా అందించడంలో ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఎమ్మెల్యే, పీఏసీఎస్ ఛైర్మన్, అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. దీంతో విసుగు చెందిన రైతులు శుక్రవారం హైవేపై సుమారు రెండు గంటలపాటు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి యూరి యా ఇప్పిస్తామని చెప్పినా ధర్నా విరమించ లేదు. అటుగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడి కారును అపి నిలదీయగా ఆయన కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి మండలానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరడంతో రైతులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య, రైతులు పాల్గొన్నారు.