ఆత్మకూర్.ఎస్, సెప్టెంబర్ 03 : ఆత్మకూర్.ఎస్ మండలం నెమ్మికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. యూరియా రేపు వచ్చే, మాపు వచ్చే అని అధికారులు తెలుపుతుండడంతో గత నాలుగు రోజులుగా దోమలు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పీఏసీఎస్ వద్దే రైతులు పడుకుంటున్నారు. యూరియా బస్తాలు వచ్చేంత వరకు ఉండి తీసుకు వెళ్తామని అక్కడే పడుకుంటున్నారు.