గుడిపల్లి, ఫిబ్రవరి 19 : యూరియా యాప్ను రద్దు చేసి, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న యూరి యా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ యూరియాను మొబైల్ యాప్ ద్వారా కాకుండా నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ యూరియా బుకింగ్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యల్గూరి వల్లపురెడ్డి, సర్పంచులు కున్రెడ్డి రాజశేఖర్రెడ్డి, అశ్విని రాజేందర్రెడ్డి, రాయనబోయిన సీనయ్య, ఆడెపు నాగేశ్, బొంగరాల వెంకటయ్య, కీరు, కిషన్ నాయక్, అర్వపల్లి సరితానర్సింహ, ఎర్ర యాదగిరి, కటికనేని మాధవరావు, సుధాకర్ గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, పరమేశ్, కె.రవికుమార్, ఆంజనేయులు వంగాల కృష్ణారెడ్డి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.