ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో సిరి పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు.
అనంతగిరి, ఫిబ్రవరి 18 : అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో సిరి పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను రైతులకు వివరించారు. ఈ సంధర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు, కిసాన్ సేవారత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. గత 60 సంవత్సరాలుగా చేస్తున్న రసాయన వ్యవసాయంతో భూసారం దెబ్బతిన్నదన్నారు. నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం, పంట ఆరోగ్యమే మన ఆరోగ్యమన్నారు.
సహజ సిద్ధ పద్ధతులతో భూసారం పెంచడం, చీడపీడల నివారణపై ఎలాంటి పెట్టుబడులు లేకుండా పలు పద్దతులను రైతులకు వివరించారు. గ్రామంలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కొల్లు సుబ్బారావు, రేవూరి పెద వెంకటేశ్వర్లు, తెలగపల్లి సైదులు, దేవులపల్లి నరసింహరావు, రేవూరి రాంబాబు, చిప్పల రాంబాబు, పగిడి వెంకటేశ్వర్లు, అల్లు రమేష్, బొర్ర వెంకటయ్య, అక్కినపల్లి వెంకటేశ్వర్లు, గద్దె వెంకటేశ్వర్లు, కంటు చినవీరయ్య, జగన్నాథం, పుల్లప్ప, చిప్పల వెంకటయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

