పంట దిగుబడిలో మొలక శాతం కీలకం
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైతులు విత్తనాల ఎంపికకు అధిక ప్రాధాన్యమివ్వాలి.
- నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడి
- గుర్తింపు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి
- రైతులకు అధికారుల సూచనలు, సలహాలు
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైతులు విత్తనాల ఎంపికకు అధిక ప్రాధాన్యమివ్వాలి. విత్తనం ఎంపికపైనే పంట దిగుబడి ఆధాపడి ఉంటుంది. నాణ్యమైన విత్తన రకాలు, వాటి వివరాలపై ప్రత్యేక కథనం.
విత్తనాలు నాలుగు రకాలు
నాణ్యమైన విత్తనాలు ముఖ్యంగా నాలుగు రకాల్లో లభ్యమవుతాయి. బ్రీడర్, ఫౌండేషన్, సర్టిఫైడ్, ట్రూత్‌ఫుల్ లేబుల్స్‌లో విత్తనాలు లభ్యమవుతాయి.
ఫౌండేషన్ విత్తనం
ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పండిస్తారు. దాదాపు 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. ప్రైవేట్ విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్‌కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు.
బ్రీడర్ విత్తనం
ఇది అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పరవ్యేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు రూపొందించేవి ఇటువంటి విత్తనాలే. ఈ విత్తనం 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్‌కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర చాలా ఎక్కువ. రైతులకు రెండు కిలోలకు మించి బ్రీడర్ సీడ్ ఇవ్వరు.
సర్టిఫైడ్ విత్తనాలు
విత్తనం నుంచి నేరుగా సర్టిఫైడ్(ధ్రువీకరించిన) విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో కూడా విత్తన పర్యవేక్షకుల సమక్షంలో పండించే అవకాశం ఉంది. ఈ విత్తనానికి నీలిరంగు ట్యాగ్ వేస్తారు.
ట్రూత్పుల్ లేబుల్ ..
సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి చేసిన ఈ విత్తనాన్ని విత్తన ధ్రువీకరణ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ విత్తనాలను ట్రూత్పుల్ లేబుల్ కింద రైతులకు విక్రయిస్తుంటారు. ట్రూత్పుల్ లేబుల్ విత్తనానికి ఆకుపచ్చ రంగు ట్యాగ్ వేస్తారు. లేబుల్ ట్యాగ్‌పై విత్తన పరీక్ష చేసిన తేదీ ఉంటుంది. ఆ తేదీ నుంచి తొమ్మిది నెలల కాలపరిమితి లోపు విత్తనాన్ని కొనుగోలు చేయవచ్చు.
రైతులు ఈ సూచనలు పాటించాలి
- వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.
- బిల్లుపై నంబర్, విత్తన రకం, గడువు తేదీ, డీలరు సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి.
- లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయవద్దు.
- గడువు దాటిన విత్తనాలను కొనుగోలు చేయకూడదు.
- కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్‌పై సీల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
- కొన్న విత్తనాలను డీలరు వద్దే తూకం వేయించుకోవాలి.
- మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.
- కొనుగోలు చేసిన విత్తన బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలి.
- అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినా సరే బిల్లు తీసుకోవాలి.
- విత్తనాలు కొన్న వెంటనే మొలకశాతం చూసుకోవాలి. మొలక శాతం బాగా ఉండే విత్తనాలనే వాడాలి.
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి
వరి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి. దళారుల మాటలు నమ్మకుండా వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. లూజుగా ఉన్న సంచులు, గడువు దాటిన విత్తనాలను కొనుగోలు చేయరాదు. అధికారుల సలహాలు, సూచనలు పాటించి వరి సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.
-షేక్ జావిద్, ఏఓ, నేరేడుచర్ల
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

