చండూరు, ఫిబ్రవరి 6 : పొద్దుగాల సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టడం.. రాత్రి ఆయన దగ్గరకు పోయి కాళ్లు మొక్కుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అలవాటైందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం చండూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రోడ్‌షో, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 4వ వార్డులో ఇరిగి వెంకటమ్మ రామన్న, 5వ వార్డులో గుండ్రెడ్డి మధుతో కలిసి మల్లన్న గుడి దగ్గర నుంచి లేపాక్షి కాలనీ, రాజీవ్ కాలనీ, అంగడిపేట ఎల్లమ్మ గుడి వరకు ప్రచారం చేస్తూ రోడ్‌షో నిర్వహించారు. 9వ వార్డులో గుంటి పద్మ వెంకటేశంతో కలిసి ఎన్టీఆర్ కాలనీ మీదుగా వినాయక మండపం, తహసీల్దార్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేశారు.
3వ వార్డులోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. కౌన్సిలర్ అభ్యర్థి సామ సుజాత యాదవరెడ్డితో కలిసి లక్కినేనిగూడెంలో గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 10వ వార్డులో అభ్యర్థి కొత్తపాటి సతీశ్‌ను గెలిపించాలని కోట మైసమ్మ దేవాలయం కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డికి సాగు, తాగునీటి మీద కనీస అవగాహన లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి కోసం శివన్నగూడెం ప్రాజెక్టు తీసుకొచ్చి 90 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన 10 శాతం పనులు చేయలేక రాజగోపాల్‌రెడ్డి చేతులెత్తేశారని ఆరోపించారు. చండూరులో రాజగోపాల్‌రెడ్డి కొందరిని నయీములను తయారు చేశారని ఆరోపించారు.
పేదలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, మండల మహిళ పట్టణ, మండల అధ్యక్షులు సంగెపు సువర్ణ, పెండ్యాల గీత, మండల మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, బీఆర్ఎస్ 3, 4, 5, 9 వార్డుల అధ్యక్షులు చొప్పరి దశరథ, ఇరిగి రామకృష్ణ, నకిరేకంటి రామలింగం, భూతరాజు వెంకన్న, గొపిడి వెంకట్‌రెడ్డి, కళ్లె సైదులు రెడ్డి, కళ్లె సురేందర్‌రెడ్డి, పడసనబొయిన లింగస్వామి, పల్లె నాగార్జున, ప్రసాద్, దాసరి స్వామి, కళ్లెం మహేందర్‌రెడ్డి, చొప్పరి కళ్యాణ్, పాశం శేఖర్‌రెడ్డి, కాసాని శ్రీధర్‌రెడ్డి, రామకృష్ణ, కారింగు స్వామి, నందికొండ నర్సిరెడ్డి, నారపాక శంకర్, ఇడికోజు నాగరాజు పాల్గొన్నారు.