రామగిరి, నవంబర్ 26 : భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకుల రవి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్లో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఉద్యోగులకు భారత రాజ్యాంగంపై బుధవారం నిర్వహించిన సదస్సు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు గుర్తుగా దీనిని ‘సంవిధాన్ దివస్’ అని కూడా పిలుస్తారని తెలిపారు. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు.
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిన రోజును ఈ దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు. ఇది భారత రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకోవడానికి, రాజ్యాంగం ద్వారా లభించే ప్రాథమిక హక్కులు, విధులను తెలుపుతుందన్నారు. భారత రాజ్యాంగం విలువలు, హక్కులు, ఇండియన్ ఎంటర్ప్రైజెస్ కోఆపరేటివ్స్ విధులు, హక్కులు ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమం ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ గణేశ్ పాల్గొన్నారు.

Ramagiri : రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరు పరిరక్షించాలి : ఎంజీయూ ప్రొఫెసర్ ఆకుల రవి