త్రిపురారం, జూన్ 26 : డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని నల్లగొండ జిల్లా త్రిపురారం మండల ఎస్ఐ కైగూరి నరేశ్ అన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ డే సందర్భంగా గురువారం మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులు, అన్ని పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గత వారం రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా చిత్రలేఖనం, సృజనాత్మక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించినట్లు తెలిపారు.
నేడు యువత డ్రగ్స్, మందు, సిగరెట్ వైపు మళ్లి జీవితాలను నాశనం చేసుకుంటుందన్నారు. చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన యువత మత్తుకు బానిసై వారి జీవితంతో పాటు వారి కుటుంబాన్ని కూడా బజారుపాలు చేస్తుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మండలంలో ఎక్కడైనా డ్రగ్స్ సమాచారం తెలిస్తే పోలీసులకు తెలుపాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా విద్యార్ధులు, యువత భవిష్యత్‌ను నాయకులు కాపాడాల్సిన అవసరం ఉందని, గ్రామ గ్రామాన యువకులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. చెడు దారిన వెళ్లే యువతకు పెద్దలు మంచి బుద్దులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవినాయక్, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, ముడిమల్ల బుచ్చిరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, కామెర్ల జానయ్య, బైరం కృష్ణ, హెచ్ఎంలు సీహెచ్.రవి, వెంకటేశ్వర్లు, ఎండీ.సలీం, కందిమళ్ల దామోదర్, నాయకులు అల్లంపల్లి జానయ్య, అవిరెండ్ల వీరయ్య, గుండెబోయిన వేణు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
Tripuraram : డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ పాల్గొనాలి : ఎస్ఐ నరేశ్
Tripuraram : డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ పాల్గొనాలి : ఎస్ఐ నరేశ్