చండూరు, జూన్ 06 : చండూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల పనులను శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి దుకాణాల యజమానులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు వెడల్పునకు అందరూ సహకరించాలన్నారు. చండూరు మున్సిపాలిటీని ఇచ్చిన మాట ప్రకారం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.
అంతకు ముందు బంగారిగడ్డ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, కొరిమి ఓంకారం, మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత-వెంకటేశ్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, అబ్బనబోయిన లింగయ్య, ఇరిగి మల్లేశ్, పల్లె వెంకన్న, భీమనపల్లి శేఖర్, భూతరాజు వేణు, ధర్మేందర్, దశరథ, పి.లింగయ్య, మారయ్య, ఇరిగి వెంకన్న పాల్గొన్నారు.