చండూరు, మే 20 : నర్సరీల్లో పెంచిన అన్ని మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామ పంచాయతీ నందు నర్సరీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 2025-26 వన మహోత్సవంలో భాగంగా 6 వేల మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శులను, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు.
ఈ సీజన్‌కు సంబంధించి ప్లాంటేషన్ చేయడానికి దిశా నిర్దేశం చేయడం జరిగిందని, వెంటనే ప్లాంటేషన్ కు సంబంధించి పనులు గుర్తించి ఎస్టిమేషన్ తయారుచేసి గుంతలు తీయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బండారి యాదగిరి, ఏపీఓ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్లు, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.