నిడమనూరు, ఆగస్టు 28 : మండలంలో వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా రైతులు వర్షాలను సైతం లెక్క చేయకుండా పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నారు. పీఏసీఎస్‌కు వచ్చిన 35 టన్నుల యూరియాను పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తిరుమలగిరి ఆగస్టు 28 : తిరుమలగిరిలోని వాసవి ట్రేడర్స్ ఎదుట గురువారం యూరియా కోసం రైతులు అవస్థలు పడ్దా రు. కొందరికి పెద్దమొత్తంలో అందచేసి, మిగతీ వారికి ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కట్టంగూర్, ఆగస్టు 28 : రైతన్నలకు యూరియా కొరత వెంటాడుతోంది. గురువారం కట్టంగూర్ పీఏసీఎస్‌కు 440బస్తాల యూరియా రావడంతో తెలుసుకున్న రైతులు ఆరు గంటలకే అక్కడికి చేరుకున్నారు. పాసుబుక్‌లను సీరియల్లో పెట్టి 440 బస్తాలకు గానూ 200మంది రైతులు తమ పేరన్లు నమోదు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారి గిరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసుల పహారాలో సింగిల్‌విండో ఒక్కో రైతుకు రెండు నుంచి మూడు బస్తాల యూరియాను పంపిణీ చేశారు.
నార్కట్‌పల్లి ఆగస్టు 28: రోజలు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతలకు గోస తప్పడం లేదు. సమైఖ్య రాష్ట్రంలో మాదిరిగానే చెప్పులు, పాసు పుస్తకాలు లైన్లో పెడుతూ తిప్పలు పడుతున్నా..పాలకులు కసీసం పట్టించుకోవడంలేదని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ ఎదుట గురువారం రైతు లు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరతను కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని ధ్వజమెత్తారు, తక్షనమే యూరియా ఇవ్వాలని లేనిపక్షంలో పురుగుల మందు తాగుతామని రైతులు హెచ్చరించారు.
మోతె, ఆగస్టు 28 : యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని సిరికొండలోని సొసై టీ వద్ద గురువారం బారులుదీరారు. పంట సాగు చేసి నెల రోజులు కావస్తున్న యూరియా అందకపోవడంతో రైతులు ఉదయం లేవగానే సొసైటీలు, పురుగుల మందుల షాపుల చుట్టూ తీరాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. సిరికొండ సొసైటీకి 222 బస్తాలు యూరియా రావడంతో సుమారు 500 మంది రైతులు క్యూకట్టడంతో 222 మందికి ఇచ్చారు. మిగతా వారు సక్రమంగా యూరియా పంపిణీ చేయ డం లేదని సొసైటీ వద్ద ఆందోళనకు నిర్వహించారు. రైతుకు కట్ట చొప్పున యూరియా ఇవ్వడంతో సరిపడడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తిండి తిప్పలు లేకుం డా సొసైటీల వద్ద బారులుదీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు మొత్తుకుంటున్నారు.