అర్వపల్లి, ఫిబ్రవరి 06 : పరిసరాల పరిశుభ్రతను ప్రజలు తప్పక పాటించాలని సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామన్నగూడెంలో పారిశుధ్య కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం, డ్రై డే, ఆయిల్ బాల్ గురించి, డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికిటప్పుడు శుభ్రం చేయడం, లీకేజీలను అరికట్టడం, వాటర్ క్లోరినేషన్ చేసే విధానం, బ్లీచింగ్ పౌడర్ కలిపే మోతాదు, లాక్ మెయింటెన్స్ పరిశీలనతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చునాయక్, ఉప సర్పంచ్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఏఎన్ఎం గిరిజ, వార్డు సభ్యులు మీనాక్షి,లతీఫ్, రవి, సరిత రామకృష్ణ, సైదులు, శారద, నాగరాజు, తనేష్, స్రవంతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.