అర్వపల్లి, మే 01 : బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుని విద్యావంతులు కావాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల నోడల్ అధికారి కుంభం ప్రభాకర్ అన్నారు. గురువారం తిమ్మాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామం అంతా కలియ తిరుగుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో చేరే విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని వారి తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రారెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ కర్కాని శైలజ జానయ్య, ప్రాథమిక పాఠశాల మాజీ చైర్మన్ బూరుగుల రాంబాబు, వర్దేల్లి కృష్ణ పాల్గొన్నారు.