కట్టంగూర్, ఆగస్టు 19 : ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన మొక్కలు ఎండిపోకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకన్న, గౌడ సంఘం అధ్యక్షుడు బందార అచ్చాలు, పెద్ద గౌడు గుడుగుంట్ల వెంకన్న, ఫీల్డ్ అసిస్టెంట్ దాసరి యాదగిరి, కల్లుగీత కార్మిక సంఘం కార్యదర్శి పోలగోని వెంకన్న, సభ్యులు దేశని రామకృష్ణ, గుడుగుంట్ల నగేశ్, దండంపల్లి శ్రవణ్, బింగి రాజు, దండంపల్లి సత్తయ్య, పనస శంకర్, దేశని వెంకటయ్య, దండంపల్లి మహేశ్ పాల్గొన్నారు.