సూర్యాపేట, ఆగస్టు 12 : సూర్యాపేట మండలం నల్ల చెరువుతండా వద్ద కుప్పిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్తున్న 11 KV విద్యుత్ లైన్‌కు చెందిన 5 స్తంభాలు సోమవారం కురిసిన భారీ వర్షానికి ఒకేసారి కుప్పకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు రహదారి వైపు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. రైతులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.