తుంగతుర్తి, జూలై 18 : వ్యవసాయ రంగానికి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ.. గత వారం రోజులుగా విద్యుత్ కోతల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ కోతల వల్ల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, వాటిని బాగు చేసుకోవడానికి రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. ఒక పక్క వర్షాలు సరిగ్గా పడకపోవడం, మరోపక్క భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గడచినా 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీను, గుడిపాటి వీరయ్య, మట్టిపెల్లి వెంకట్, గునిగంటి యాదగిరి, గౌడిచర్ల సత్యనారాయణ , గడ్డం సోమేశ్ , పూర్ణ నాయక్, తడకమళ్ల రవికుమార్ , సర్పంచ్ లు మనోజ్, మాత్తంగి వెంకటమ్మ కరుణాకర్, నాయకులు వీరోజీ, యాకూనాయక్, కళ్యాణ్, గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, నాగమల్లు, శ్రీకాంత్, సాయికిరణ్, మహేందర్, వెంకటేష్, మల్లికార్జన్, భాస్కర్, రమేష్, వెంకన్న, వీరన్న, సురేష్, ప్రవీణ్, సురేష్ పాల్గొన్నారు.