కట్టంగూర్, జనవరి 02 : ఎలక్ట్రికల్ స్కూటర్లతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎన్ డీసీసీబీ కట్టంగూర్ బ్రాంచ్ మేనేజర్ మిర్యాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన శివాజీ జాయింట్ లయబిలిటీ గ్రూప్ సభ్యులకు రుణ సదుపాయం ద్వారా స్వచ్ఛ శక్తి మోడల్ ఐదు ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేసి మాట్లాడారు. వ్యవసాయ అవసరాలతో పాటు పర్యావరణ అనుకూల రవాణాకు ఎలక్ట్రికల్ స్కూటర్లు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఎఫ్పీఓ చైర్మన్ చౌగోని సైదమ్మ, మేనేజర్ నాగరాజు, సూపర్ వైజర్ మహేశ్ రెడ్డి, స్వశక్తి ఎలక్ట్రికల్ వెహికిల్ మేనేజర్ త్రిలోక్ మౌళి, ఆపరేషన్ మేనేజర్ పవన్, జిల్లా సహకార బ్యాంక్ కట్టంగూర్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ రాధిక, రజిత పాల్గొన్నారు.