నేరేడుచర్ల, డిసెంబర్ 03 : ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి.రవి నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం నేరేడుచర్ల మండలం దిర్శించర్ల, చిల్లేపల్లిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తాసీల్దార్ సురగి సైదులు, ఎండీఓ సోమ సుందర్ రెడ్డి, ఎంపీఓ నాగరాజు ఉన్నారు.