నార్కట్‌పల్లి, అక్టోబర్ 31: సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వచ్చే ఎన్నికల్లో తనను దీవించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పోతినేనిపల్లె, ఎం.యెడవల్లి గ్రామాల్లో మంగళవారం సాయం త్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థ్ధి చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్దిలో ఆదర్శంగా ఉంచానని తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకం అందిందని అందుకోసం కారు గుర్తుకే ఓటు వేయాలన్నారు. అబద్దపు ప్రచారంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊర్లలోకి తిరుగుతున్నారని వారికి పాలన అందిస్తే తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దు
కట్టంగూర్ : మోసపూరిత వాగ్దానాలతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయ మాటలు ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. మండలంలోని పామనుగుండ్ల, ఎరసానిగూడెం గ్రామాల్లో మంగళవారం ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రజా సంక్షేమమం కోసం పని చేసే బీఆర్ఎస్ను ఎన్నికల్లో గెలిపించుకోవాలన్నారు. ఆంధ్రా పాలకుల పాలనలో దగాపడ్డ తెలంగాణను సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే బాగు చేశారన్నారు. ప్రజలను వంచించిన ప్రభుత్వాలు కావాలా ప్రజల గౌరవంగా బతికేలా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
గ్రామాల్లో మంగళహారతులతో స్వాగతం
అంతకు ముందు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మహిళలు మంగళహారతులు స్వాగతం పలికి తిలకం దిద్దారు. కార్యక్రమంలో నార్కట్‌పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, సిరిగిరెడ్డి వినోదాశేఖర్రెడ్డి, ఎంపీటీసీలు పాలడుగు హరికృష్ణ, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, ఉప సర్పంచ్ చెరు కు నర్సింహ, ఆకటి వెంకన్న, గ్రామశా ఖ అధ్యక్షులు గుండాల శ్రీను, రామచంద్రు, నాయకులు శ్రీరామోజు సత్యనారాయణ చారి పాల్గొన్నారు.
పలు కుటుంబాలు బీఆర్ఎస్లో చేరిక
మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి 50 కుటుంబాలు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాం గ్రెస్ గ్యారెంటీలను నమ్మొద్దు అని, మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా అమలుచేసిన వ్యక్తి సీఎం కేసిఆర్ అన్నారు. పార్టీలో చేరిన వారిలో కొరివి వెంకటేశం, అంబటి లింగస్వామి, అంబ టి నాగయ్య, పర్వతం జానయ్య, గంగదేవి నాగబాబు, వెంకన్న, తిరుపారి రాజు, అంబటి ముత్యాలు, మట్టిపల్లి నాగరాజు, మల్లెబోయిన గోపాల్, వనం శామంతి, వనం సైదులు, వనం మదార్, వనం శంకర్, మల్లెబోయిన యాదయ్య, వనం లింగస్వామి, తిరుపారి సైదులు, తిరుపారి శివయ్య, క్రాంతికుమార్, సంతోష్,రవికుమార్, మహేశ్, సునీల్ ఉన్నారు.
నార్కట్‌పల్లిలో 100 మంది ఎన్ఎస్యూఐ నాయకులు
నార్కట్‌పల్లి పట్టణానికి చెందిన ఎన్ఎస్యూఐ నాయకులు 100 మంది ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో నాగరాజు, సాయి, సాయికుమార్, అశోక్, ప్రవీణ్, మహేశ్ నాని, సతీశ్, రాకేశ్, వేణు, మహేశ్, వెంకట్, అఖిల్, మని, జాకి, అంజి, శివ, సందీప్, శివ, ఉదయ్, సూర్య, దుర్గ, మనోజ్, సాయిలు ఉన్నారు.