కోదాడ, ఫిబ్రవరి 05 : కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి హనుమానాయక్ గెలుపును కాంక్షిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ గురువారం ఆ వార్డులో ముమ్మర ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను హనుమానాయక్ కు ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరారు. అదేవిధంగా పట్టణంలోని 26వ వార్డు అభ్యర్థి కుక్కడపు సువర్ణాదేవి, వెంకటేశ్వర్లు గెలుపును కోరుతూ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా క్షేమమే విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టణం, వార్డు అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : షేక్ నయీమ్