బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి చిట్యాల పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలను కోరారు. గురువారం చిట్యాలలోని 1, 4, 6, 7, 9వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
చిట్యాల, ఫిబ్రవరి 05 : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి చిట్యాల పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలను కోరారు. గురువారం చిట్యాలలోని 1, 4, 6, 7, 9వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే భాగ్యనగర్ కాలనీలో పర్యటించి కాలనీవాసులతో ముఖాముఖి నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై కాలనీవాసుల అభిప్రాయాలను సేకరించారు. వారంతా గతంలోనే అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకున్న వారు లేరని చిరుమర్తి దృష్టికి తీసుకువచ్చారు.

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
దీంతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. 4వ వార్డులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ వార్డులో గతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. పట్టణంలోని 12వ వార్డులలో ఏ వార్డులలోనైనా బీఆర్ఎస్ కాలంలో జరిగిన అభివృద్ధి తప్పా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా జరగలేదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

