మునుగోడు, మే 03 : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 327 యూనియన్ మునుగోడు సెక్షన్ లీడర్ పెరుమాల్ల నరసింహ ఆధ్వర్యంలో శనివారం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిస్కం ప్రెసిడెంట్ ఎం.సురేశ్‌కుమార్ పాల్గొని యూనియన్ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
విద్యుత్ కార్మికులు, ఆర్టిజన్లు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం 327 యూనియన్ పని చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. నల్లగొండ డివిజన్ ప్రెసిడెంట్ కె.సమ్మిరెడ్డి, సెక్రటరీ పాండు, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరయ్య, సెక్షన్ లీడర్ పెరుమాళ్ల నరసింహ, సీహెచ్ నాగయ్య, స్వామిరెడ్డి, వెంకటరమణ, భిక్షమయ్య, ముత్యం, వరప్రసాద్, మోహన్‌రెడ్డి, అనిల్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.