రామగిరి, జూలై 10 : నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో ఆంగ్ల భాషోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్-1 శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలుపరుస్తూ విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేసి, సమర్ధవంతమైన అభ్యాసకులుగా తయారు చేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి సామాజిక స్థితిగతులు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని వారి పట్ల సహానుభూతితో వారి వైయక్తిక విభేదాలను దృష్టి యందుంచుకుని అందుకు అనుగుణంగా విద్యాబోధన అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుశీందర్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, డైట్ ప్రిన్సిపాల్ నరసింహ, సెంటర్ ఇన్చార్జి రఘుపాల్ రెడ్డి, రిసోర్స్ పర్సన్లు అనురాధ, విష్ణు, శ్రీనివాస్, ఉమాశంకర్, సత్యనారాయణ శ్రీధర్ పాల్గొన్నారు.