చందంపేట, సెప్టెంబర్ 04 : చందంపేట మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని పొగిళ్లా, కంబాలపల్లి, వెల్దురుపల్లి, బొల్లారం, ఉస్మనుకుంట, పాత తెల్దేవరపల్లి, ముత్యతండాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పొగిళ్ల గ్రామంలో రూ.3.50 కోట్లతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీధర్ బాబు, ఎంపీడీఓ లక్ష్మి, సర్వయ్య, గోవిందా యాదవ్, బాధ్య నాయక్ సాదిక్, మల్లేశ్ యాదవ్, హరికృష్ణ పాల్గొన్నారు.