నల్గొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 11 : సమాజానికి ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసి అందించే కేంద్రాలు బీఈడీ, బీపీఈడీ కళాశాలలు. అయితే వీటిలో మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఈడీ, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్ తో అకాడమిక్ రివ్యూ సమావేశం మంగళవారం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని అదే విధంగా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి కళాశాలలో అర్హులైన అధ్యాపకులు ఉండాలని రోజువారీగా కార్యక్రమం కోకరిక్యులం అంశాలలో బోధన సాగాలన్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, టీచింగ్ డైరీలు ఎప్పటికప్పుడు రాయాలని ప్రతి వారంలో నమోదైన అంశాలను యూనివర్సిటీ అకాడమిక్ ఆర్డర్స్ ఎందుకు నివేదికలు సమర్పించాలన్నారు.
ఉపాధ్యాయ విద్య అభ్యసించే వారికి స్కూల్ టీచింగ్ ప్రాక్టీస్ ముఖ్యమని అందుకు సంబంధించి ప్రతి విద్యార్థి ని ఆల్మానిక్ లో సూచించిన విధంగా టీచింగ్ ప్రాక్టీస్‌కు పంపించాలన్నారు. అందుకు సంబంధించిన డీఈఓ కార్యాలయం నుంచి అనుమతి ఇచ్చిన పాఠశాలలకు విద్యార్థులను పంపించే షెడ్యూల్లో ముందస్తుగానే పూర్తి వివరాలతో యూనివర్సిటీకి సమర్పించాలన్నారు. ఈ విషయంలో యూనివర్సిటీ అధికారులు ఆకస్మికంగా ఆయా పాఠశాలల్లో తనిఖీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా విద్యార్థులు కళాశాలకు హాజరు కావడం కళాశాలలో మౌలిక వసతులు అధ్యాపకులు సైతం తనిఖీ చేస్తారని వీటిలో తేడాలు వస్తే అవసరమైతే కళాశాలలో గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. అని సవ్యంగా పాటించడంతోపాటు ప్రతి విద్యార్థి 80% హాజరు ఉండాలని లేని పక్షంలో యూనివర్సిటీ నిర్వహించే పరీక్షలకు అనుమతించడం జరగదు అన్నారు.
యూనివర్సిటీ కళాశాలలో చదివే విద్యార్థులతో పాటు అనుబంధంగా ఉన్న కళాశాలలో విద్యను విధించే విద్యార్థులకు నైపుణ్యాలు అందించేందుకు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ సెంటర్(ఐఐసీ) పనిచేస్తుందన్నారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి, కమ్యూనికేషన్ ఇండస్ట్రీ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచేలా పరస్పర సమన్వయంతో శిక్షణ అందిస్తామని అందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వర్సిటీ అకాడమిక్ ఆడిట్స్ అండ్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆడిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జయంతి, కోఆర్డినేటర్ డాక్టర్ అమరేందర్ సీనియర్ అసిస్టెంట్ సరిత సిబ్బంది శ్రీనివాస్ సంధ్య, వివిధ కళాశాల ప్రిన్సిపల్స్ యాజమాన్యాలు డాక్టర్ పి గంగాధర్ రావు , కృష్ణారెడ్డి, ఎంబి దేవరాజ్ ,రజిని, సుభాషిని, సైదులు,. శ్రీనివాస్ రెడ్డి, విద్యాసాగర్ పాల్గొన్నారు.