కట్టంగూర్, నవంబర్ 19 : లయన్స్ క్లబ్ అధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ప్రముఖ న్యాయవ్యాది కేవీ.ప్రసాద్ అన్నారు. నల్లగొండ లయన్స్ క్లబ్ అధ్వర్యంలో క్లబ్ సీనియర్ సభ్యుడు బండారు హరినాథ్ సతీమణి యోగమాల జ్ఞాపకార్ధం 12 డ్యూయల్ డెస్క్ బెంచీలను బుధవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవే లక్ష్యంగా తమ లయన్స్ క్లబ్ పని చేస్తుందన్నారు. క్లబ్ అధ్వర్యంలో చేపట్టన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని గత ప్రభుత్వం పాఠశాలల్లో అనేక కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు.
పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చి వసతుల కల్పనకు చేయూతను అందించడంతో పాటు వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మల పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్ పర్సన్ మిరియాల యాదగిరి, లయన్ లీడర్లు బండారు రామలింగయ్య, చిలుకూరి రామకృష్ణ, అశోక్, సాయికుమార్, కృష్ణయ్య, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం అంథోని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.