నల్లగొండ: జిల్లాలోని నకిరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిప్పర్తి వద్ద ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం ఉదయం తిప్పర్తి రోడ్డులోని ఫ్లైఓవర్‌పై బ్రేక్‌డౌన్ కావడంతో ఓ లారీ ఆగిపోయింది. అయితే వెనక నుంచి వచ్చిన కంటైనర్.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కంటైనర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయాలవడంతో అతడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో డ్రైవర్ మృతదేహాన్ని క్యాబిన్ నుంచి బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటన కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.