మునుగోడు, సెప్టెంబర్ 16 : మునుగోడు మండల కేంద్రంలో డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్ధులను మెనూ అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్డులను పరిశీలించి, వివరాలు తెలుసుకుని పలు సూచనలు ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దన్నారు. డీపీఓ వెంట ఎంపిడీఓ యుగంధర్ రెడ్డి, ఎంపీఓ ఎండీ పర్వేజ్, ఎస్సీ హాస్టల్ వార్డన్ ఎం.వెంకన్న, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.