తిప్పర్తి, నవంబర్2 : cతిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ఆమె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మండలంలోని అంతయ్యగూడెం వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులు, కేంద్రం నిర్వాహకులు, కూలీలు, హమాలీలతో ఆమె ధాన్యం సేకరణకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు నాగయ్యతో మాట్లాడుతూ ధాన్యం ఎప్పుడు తీసుకొచ్చారని అడుగగా వారం రోజుల క్రితం ధాన్యం తెచ్చానని, తేమ ఎక్కువగా ఉన్నందున ఇక్కడే ఆరబెట్టుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపాడు. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రం లో ఎంత మంది హమాలీలు ఉన్నారని అడుగగా 45మంది ఉన్నారని కాంట్రాక్టర్ తెలిపాడు. అంతగూడెం ఐకేపీ కేంద్రంలో 60మంది రైతులు వచ్చారని, రోజు ఒక లారీ లోడుకు సంబంధించిన ధాన్యం కేంద్రానికి వస్తున్నదని నిర్వాహకులు కలెక్టర్‌కు చెప్పారు. ధాన్యాన్ని చెత్తచెదారం లేకుండా మిల్లులకు పంపించాలని సూచించారు.
ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి
నల్లగొండ రూరల్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వానకాలం పండించిన ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ రైస్ సకాలంలో చెల్లించేందుకు జిల్లా మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఆమె జిల్లా రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కేటాయించిన 10 రోజుల్లోబ్యాంకు గ్యారెంటీ సమర్పించేందుకు అండర్ టేకింగ్ ఇవ్వాలన్నారు.
జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, నారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంఆర్ సకాలంలో చెల్లించేందుకు మిల్లర్లకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ట్రాన్స్‌పోర్టు బిల్లులు, మిల్లింగ్ చార్జెస్ చెల్లించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు ధాన్యం పంపించిన 15 రోజుల్లో మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ సమర్పించేందుకు సమ్మతించారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, వ్యవసాయ జేడీ శ్రవణ్, నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తాసీల్దార్ స్వప్న, ఎల్డీఎం శ్రామిక్, ఏఓ సన్నిరాజు, ఏపీఎం శ్రీదేవి పాల్గొన్నారు.