ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి
విద్యావంతుడు, పట్టభద్రుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించగల బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
- కాంగ్రెస్, బీజేపీని నమ్మి మోసపోవద్దు
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట రూరల్/బొడ్రాయి బజార్, మే 25 : విద్యావంతుడు, పట్టభద్రుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించగల బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో, సువెన్ ఫార్మా స్యూటికల్ కంపెనీలో ఉద్యోగులు, సిబ్బందిని కలిసి రాకేశ్‌రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి అమలు కావాలన్నా ప్రశ్నించే గొంతుక మండలిలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోసారి కాంగ్రెస్, బీజేపీ మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. ఆయన వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ట్రైకార్ మాజీ చైర్మన్ రామచందర్‌నాయక్, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, తాహేర్‌పాషా, రమేశ్, భరత్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

