అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, అడుగకుండానే వరాలిస్తూ పేదలు, అభాగ్యులకు కొండంత ఆసరాగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మానవీయ పాలనలో ఆయనకు సాటి లేరని తెలిపారు.
- మానవీయ పాలనలో ఆయనను మించిన వారు లేరు
- స్వరాష్ట్రంలో అందరి జీవితాల్లో వెలుగులు
- దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
- సర్కారు చేయూతలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అభినందనీయం
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
- సూర్యాపేటలో 372 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలపంపిణీ
సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, అడుగకుండానే వరాలిస్తూ పేదలు, అభాగ్యులకు కొండంత ఆసరాగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మానవీయ పాలనలో ఆయనకు సాటి లేరని తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో 372 మంది దివ్యాంగ విద్యార్థులకు మంత్రి ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ఉపకరణాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేండ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధితోపాటు అందరి జీవితాల్లో వెలుగులు నింపడంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యం నింపి అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
– సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 8
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 8 : మానవీయత చాటడంలో సీఎం కేసీఆర్ సాటెవరూ లేరని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 372మంది దివ్యాంగ విద్యార్థులకు 100 బస్‌పాసులు, 30 ట్రై సైకిళ్లు, 80వీల్ చైర్లు, 16సీపీ చైర్లు, ఈయరింగ్ మిషన్లు, క్యాలిఫర్స్, బ్రెయిలీ కిట్లు, వాకర్ స్టిక్స్, రోలేటర్ 571ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కేవలం తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరూ ఊహించని అభివృద్ధితో పాటు అందరి జీవితాల్లో వెలుగులు నింపడంలో మనమే ఆదర్శమన్నారు. దేశంలో మరేక్కడా లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మైస్థెర్య నింపి అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేగాక అనాథలను సైతం చేరదీసి ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించి వారిని సైతం అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. శారీరక వైకల్యం అనేది మెరుగైన జీవితానికి అడ్డంకి కాదని వారికి మరింత తోడ్పాటు అందిస్తే ఏదైనా సాధించగలరనే గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత ఇస్తున్నదన్నారు. అందులో భాగంగానే వారికి అవసమైన ఉపకరణాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని దివ్యాంగ చిన్నారులు తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రియాంక, పాఠశాల హెచ్ఎం గోలి పద్మ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

