సూర్యాపేట, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం తిరుమలగిరిలో జరిగిన సభలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు చెందిన పది మందికి ముఖ్యమంత్రి తన చేతు ల మీదుగా కార్డులను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ తుంగతుర్తి గడ్డకు గొప్ప చరిత్ర ఉంది భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి మొదలుకొని తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని, నేడు నల్లగొండ అంటే నాడు ఎర్రగొండ అంటూ ఉద్యమానికి ఊపిరిలూదిందన్నారు.
తెలంగాణలో 3 కోట్ల 12లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. ఏక కాలంలో రాష్ట్రంలోని 5.60 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. సభ ప్రారంభానికి ముందు నియోజకవర్గ పరిధిలోని అడ్డగూడూరు, నాగా రం మండలాలకు పోలీస్‌స్టేషన్, తాసీల్దారు కార్యాలయాలు, వెలుగుపల్లి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గో దాం, తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సభా ప్రాంగణ సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని 21వేల కోట్ల రూ పాయల రుణమాఫీ చేశామన్నారు. వేల కోట్ల రూపాయలను రైతు భరోసా పేరిట రైతుల ఖాతాల్లో జమా చేశామని చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాల్లోని ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తున్నామని, 21 వేల కోట్ల రూపాయలను జీరో వడ్డీతో బ్యాంకు రుణాలను ఇస్తున్నామన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. వంద ఏం డ్ల తర్వాత తెలంగాణలో జనగణన, కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మ హేశ్కుమార్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.