చండూరు, ఏప్రిల్ 07 : చండూరు మండలంలో పలువురి లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. పుల్లెంల గ్రామానికి చెందిన బొడ్డు సత్తయ్యకు రూ.24 వేలు, బొడ్డు వెంకన్నకు రూ.15 వేలు, లోక జయశ్రీ- రూ.60 వేలు, నీలకంఠం మారయ్య- రూ.27 వేలు, ముక్కముల రాజు- రూ.24 వేలు, పాలకూరి సైదులు- రూ.15 వేలు, ఓర్సు కళ్యాణ్- రూ.60 వేలు, ఎర్ర యాదగిరి- రూ.60 వేలు మొత్తం 2, 85,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కముల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ చెడుబుద్ధి ఉషయ్య, మాజీ ఎంపీటీసీ వడ్డగోని రాఘవేందర్, మండల నాయకుడు మందడి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.