మునుగోడు, మే 05 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మునుగోడు పట్టణానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పట్టణాధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు మిర్యాల వెంకన్న, పందుల నరసింహ, మాజీ ఎంపీటీసీలు పందుల భాస్కర్, జిట్టగోని యాదయ్య, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండీ.అన్వర్, సిల్క్ సంఘం అధ్యక్షుడు సింగం గిరి, మాజీ వార్డు మెంబర్ పందుల నరసింహ, ఆరేళ్ల సైదులు, జిట్టగోని సైదులు, గ్రే గౌరీ, దుబ్బ రవి, దుబ్బ ప్రభాకర్, ఈద పవన్, ఉడుత సత్యనారాయణ పాల్గొన్నారు.