ఆత్మకూరు.ఎస్, డిసెంబర్ 27 : ఆత్మకూరు.ఎస్ మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బత్తుల రాజేంద్ర ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవాల పెంపకందారులు తమ జీవాలకు ప్రభుత్వం వారు ఉచితంగా పంపిణీ చేస్తున్న నట్టల మందు పంపిణీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డా.నాగేంద్ర బాబు, గోపాల మిత్ర సైదులు, సిబ్బంది శ్రీను, రైతులు ఉప్పల రాజమల్లు, శ్యామల లింగయ్య, పొన్నం శ్రీను, గణేశ్, శ్యామల గణేశ్ పాల్గొన్నారు.