మిర్యాలగూడ: పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా అని ఆ దిశగానే సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు కాలనీల్లో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
పట్టణంలో అన్ని ప్రాంతాల్లో ఏడాది లోపు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
మహిళలు తాగునీటి కష్టాలు లేకుండా మిషన్ భగీరథ నీటిని ఇంటింటికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. పట్టణ వ్యాప్తంగా లో ఓల్టేజీ సమస్యలు లేకుండా పట్టణంలో కొత్తగా సబ్స్టేషన్, ట్రాన్సుఫార్మర్లు ఏర్పాటు చేయడం వలన లో ఓల్టేజీ సమస్య పరిష్కారం అయిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ సాయిలక్ష్మి, కౌన్సిలర్ బాసాని అలివేలు, వింజం శ్రీధర్ పాల్గొన్నారు.