– సకల సదుపాయాలతో బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రారంభం
– ప్రపంచస్థాయి పోటీ తట్టుకునేలా విద్యావిధానం
నల్లగొండ, జనవరి 27 : చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నల్లగొండ ప్రజలు తన ప్రాణమని.. సాధారణ రైతు బిడ్డగా వస్తే అక్కున చేర్చుకుని రాష్ట్రంలోనే పెద్ద నాయకుడిని చేసినట్లు చెప్పారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీనియర్ మంత్రిగా అన్ని పదవులు నల్లగొండ ప్రజలు పెట్టిన బిక్షే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ధైర్యంగా తన వెన్నంటి ఉన్నారని, ఇక్కడి ప్రజల కోసం ఎంత చేసినా తక్కువే అన్నారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల తన చిరకాల కోరికర అని తెలిపారు. 2,500 గజాల స్థలంలో అన్ని హంగులతో, డిజిటల్ విద్యా విధానం, వరల్డ్ఆఫ్ విద్యా విధానంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించనున్నట్లు వెల్లడించారు. పేదవాడు చదువుకోవాలి. చదువుతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు.

Nalgonda : చదువుతోనే అభివృద్ధి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల రొటీన్ పాఠశాల కాదని ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనే విధంగా ఇక్కడ విద్యా విధానం ఉంటుందని తెలిపారు. పాత సిలబస్ తో పాటు, సీబీఎస్ఈ సిలబస్ తేనున్నట్లు, సాంప్రదాయ విద్యా విధానం కాకుండా అన్ని రకాల పోటీలు ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. అనుభవాత్మక విద్యను అందించనున్నట్లు, విద్యతో పాటు ప్రకృతి అనుసంధానంతో ప్రకృతి వ్యవసాయం, మట్టికుండల తయారీ, కంప్యూటర్, ఏఐ, ఇలా అన్ని రకాల నైపుణ్యాల అభివృద్ధికి, విద్యార్థుల సృజనాత్మకతను పెంచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బొట్టుగూడ పాఠశాలలో ఇండోర్ గేమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, యోగా సెంటర్, డిజిటల్ తరగతులతో పాటు, ప్రతి తరగతి గదిలో ఏసీ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Nalgonda : చదువుతోనే అభివృద్ధి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
పాఠశాలలో 45 కంప్యూటర్లు ఉన్నాయని, దేశంలోనే ఇలాంటి ప్రభుత్వ పాఠశాల ఉండదన్నారు. ఆణిముత్యాల లాంటి విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్టులుగా తయారు చేయనున్నట్లు చెప్పారు. పేదవాడి చదువు కోసం అందరూ కృషి చేయాలని కోరారు. బొట్టుగూడ పాఠశాలకు ప్రవేశాలను బట్టి అవసరమైతే అదనపు భవనాలను కట్టిస్తామని తెలిపారు. నల్లగొండ అభివృద్ది కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు, విద్య, మంచి వైద్యం తన మొదటి ప్రాధాన్యతగా వెల్లడించారు. ఎవరూ అడగకపోయినా ముఖ్యమంత్రిని ఒప్పించి నల్లగొండను కార్పొరేషన్‌గా చేసినట్లు, త్వరలోనే కొత్త మేయర్, కార్పోరేటర్లు రాబోతున్నారన్నారు. అలాగే తన గుండె వంటి ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు తాగు, సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, లైబ్రరీ చైర్మన్ ఆఫీజ్ ఖాన్, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

Nalgonda : చదువుతోనే అభివృద్ధి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి