రామగిరి, ఏప్రిల్ 17: ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మికులకు దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా కదంతొక్కారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం అన్ని కార్యాలయాలతో పాటు పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట, డివిజన్, మండల కేంద్రాల్లో ధర్నా చేసి ప్రభుత్వంపై నిరసన గళం విప్పారు. జిల్లా కలెక్టరేట్ వద్ద టీజీఈ జేఏసీ కార్యదర్శి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే మే 5 తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో టీఎన్జీవో బాధ్యులు శేఖర్‌రెడ్డి, యాకుబ్ నాయక్, వంగూరి భాస్కర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మగోటి జనార్ధన్, తరాల పరమేష్, టీఎస్టీయూఎఫ్ బాధ్యులు నర్రా శేఖర్‌రెడ్డి, నలపరాజు వెంకన్న, యడ్ల సైదులు, ఎస్ ఆంజనేయులు, గేర నరసింహ, సీహెచ్ లింగయ్య, మనోజ్ ప్రదీప్, వంగూరు విజయకృష్ణ, సైదులు నాయక్, రవి నాయక్, డీఐ రాజు, రణదీవే, సత్యనారాయణ, మహమ్మద్ హనీఫ్, ము రలయ్య, కె.సైదులు, పి.సైదులు, రవీందర్, భాను ప్రకాష్, ఎన్.సైదులు, సత్యనారాయణ, పాల్వాయి అంజిరెడ్డి, మధు పాల్గొన్నారు. నల్లగొండ ఆర్డీవో, తహసీల్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ధర్నా చేశారు. ఆర్డీవో అశోక్‌రెడ్డి, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్‌గౌడ్, నాయకులు నాగవల్లి ఉపేందర్, సురేందర్, కంచనపల్లి విజయ్‌కుమార్, టీజీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
సూర్యాపేట, ఏప్రిల్ 17: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ, తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి మండుటెండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం భోజన సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, ప్రొగ్రాం కన్వీనర్ మట్టపల్లి రాధాకృష్ణ, టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ ఎస్కే జానిమియా, సెక్రటరీ జనరల్ భూపాల్, అడిషనల్ సెక్రటరీ తంగెళ్ల జితేందర్‌రెడ్డి మాట్లాడారు.పాత పెన్సన్ స్కీంను పునరుద్ధరించాలన్నారు. 2004 సెప్టెంబర్ 1 నాటికి ముందు నియమతులైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం అమలు చేయాలన్నారు. టీజీఈ జేఏసీ కోచైర్మన్లు సోమయ్య, ఆకాష్వర్మ, అంజయ్య, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, రాంబాబు, జహంగీర్, శ్రీనివాస్, సెక్రటరీ దున్న శ్యామ్, రవికుమార్, యాదగిరి, వెంకటయ్య, గెజిటెడ్ లెక్చరర్ల సంఘం కార్యదర్శి సీహెచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వాలి
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని టీజీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీజీఈ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ బెనిఫిట్స్ అందక 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు.
2023 నుంచి రావాల్సిన రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను సైతం విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఉద్యోగ జేఏసీ జనరల్ సెక్రటరీ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భగత్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. జేఏసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అమరేందర్‌రెడ్డి(పీఆర్టీయూ), కో చైర్మన్ యాదయ్య(యూటీఎఫ్), టీజీవో జిల్లా అధ్యక్షుడు, జేఏసీ కో చైర్మన్ జగన్మోహన్ ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు శ్రీకాంత్, లక్ష్మీనరసింహారెడ్డి, శ్రీనివాస్, శైలజ, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.